Tuesday, 8 April 2014

పవన్ కళ్యాణ్ కు రాంగోపాల్ వర్మ బహిరంగ లేఖ..

డియర్ పవన్ కళ్యాణ్..

'ఇజం' పుస్తకం గురించి మాట్లాడే ముందు మొదటగా నేను పశ్చాత్తాప పడాలి. నువ్వు రాజకీయపార్టీ పెడతావన్నప్పట్నుంచీ నేను అమితోత్సాహంగా ఎదురుతెన్నులు చూశాను. నీ నిజాయితీని, సమగ్రతను ఎప్పుడూ పొగుడుతుండేవాడిని. జనసేన పార్టీ ఆవిర్భావం సమయంలో నువ్వు చేసిన ప్రసంగానికి నేనూ కూడా ముగ్దుడ్నైపోయాను.
ఇజం పుస్తకావిష్కరణ గురించి నేను విన్నప్పుడు నేను అమితానందపడ్డాను. నేను చిన్నప్పట్నుంచీ పుస్తకాలను విపరీతంగా చదివేవాడిని. ఇమ్మానుయేల్ కాంట్, ఆర్థర్ స్కాపెన్ హర్, డెస్కరేట్స్, విల్హె ల్మ్ హెగెల్, ఫెడ్రిక్ నిట్జాస్కె, బారక్ స్పినోజా, అయాన్ ర్యాండ్ వంటి వారి రచనల్ని నేను ఇంజనీరింగ్ విద్యార్థి దశలోనే చదివాను. ఆ తర్వాత ఆధునిక తత్వవేత్తలకు సంబంధించిన పుస్తకాలను కూడా చదివాను. తత్త్వశాస్త్రాన్ని సమాజానికి అన్వయించడం ద్వారా ఈ సమాజంలో వేగవంతమైన మార్పులొస్తాయని బోధించిన వారే వీరంతా కూడా. ఈ పాతతరం తత్వవేత్తల ఆలోచనా విధానానికి దూరంగా పురోగతితో కూడిన విధానమేదో నీ ఇజం లో ఉంటుందని నేను భావించాను.
అలా ఎందుకు భావించానంటే... సహజాతంగా వచ్చినటువంటి మేథో సంపత్తిని నేను నీలో చూశాను. ఆఖరికి నీ ఇజం పుస్తకం చదివిన తర్వాత తీవ్రంగా దిగులు పడ్డాను. ఇజం పుస్తకంలో రాజు రవితేజ్ నవసమ సమాజ నిర్మాణానికి బోధించిన తత్త్వం ప్రాథమిక పాఠశాల స్థాయిలో వుండటమే నా దిగులుకు అసలు కారణం.
పవన్ కళ్యాణ్...నేనిక్కడ రాజు రవితేజ్ గురించే చెబుతున్నానని గుర్తుంచుకో! ఎందుకంటే ఈ ఇజం పుస్తకం రచయితగా అతని పేరునే నువ్వు ఇచ్చావు గనుక. ఇజం పుస్తకంపై నా అభిప్రాయాల్ని ప్రజా వేదికలో పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే నేను ప్రతిక్షణం నీ గురించి నా అభిప్రాయాల్ని అటువంటి ప్రజా వేదికల ద్వారానే చేరవేస్తాను.
జన సేన పార్టీ ఆవిర్భావ సమయంలో నీ ఫోజులనుంచి, నీ హావభావాలనుంచి, నీ మాటల ఊటనుంచి నేను ఒక విషయాన్ని కచ్చితంగా చెప్పగలను. ఇజం గ్రంథంలో చర్చించి వదిలేసిన నకారాత్మక విషయాలకంటే నీకు సహజాతంగా వచ్చిన జ్ఞానమే ఎక్కువ. అటువంటి ఉధ్గ్రంథాన్ని నాజీవితంలో నేనెప్పుడూ చదవలేదు. క్షమించు పవన్. రాజు రవి తేజ్ తో చెప్పించిన పాత చింతకాయ తత్త్వసిద్ధాంతాలు నీకు నిజంగా అవసరం లేదు.
ఆర్థర్ స్కాపెన్ హార్స్ పుస్తకం 'ద వరల్డ్ యాజ్ విల్ అండ్ ఐడియా'ను గానీ, ఇమ్మానుయేల్ కాంట్ పుస్తకం 'ద క్రిటిక్ ఆఫ్ రీజన్' గానీ ఒకసారి చదువు. తీరికలేని పనిఒత్తిడితో నీకు ఖాళీ దొరకదని నేను నమ్ముతున్నాను. ఆ విషయం నాకు తెలుసు. రాజు రవి తేజ ఈ పుస్తకాల్ని చదివి తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఈ పిల్లాడు నీ సహజాతమైన మేథో సంపత్తిని పాడు చేస్తున్నాడు. స్కాపెన్ హార్ ఆధిభౌతిక తత్త్వానికి, కాంట్ వేదాంతానికి, మార్క్స్ గతి తార్కిక భౌతిక వాదానికి రాజు రవితేజ్ వక్ర భాష్యం చెబుతున్నాడు. ఈ కుర్రాడు మిమ్మల్ని పూర్తి గా తప్పుదారి పట్టిస్తున్నాడు. నీ అసలుసిసలు ఆలోచనా విధానాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. అస్తిత్వ నిహిలిజాన్ని రాజు రవి తేజ్ తప్పుగా అర్థం చేసుకున్నాడు.
గతంలో వెలువడిన త్వత్తసిద్ధాంతాలు, ఆధునిక సమాజాల ఏర్పాటును మీరు కచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆ ఆధునిక సమాజానికి వందశాతం నిష్కల్మషమైన పవనిజం కావాలి. అంతేగానీ అకస్మాత్తుగా ఏదో తోచింది చేసినట్లు , తప్పుడు రాతలు, వక్రభాష్యాలు, స్వయంగా కాకుండా రెండో వ్యక్తి ద్వారా తెలుసుకునే సూడో తత్త్వాలు కాదు కావాల్సింది. సత్యాన్ని చదవడానికి ఫిలాసఫీ చక్కటి వేదిక. ఈ మార్పుల్లేని సమాజంలో సత్యం సత్యం చేతనే అజరామరమవుంతుంది. అందుకే 'సత్యాన్ని చదవడం సాధారణం కానీ ఇది అంత ముఖ్యంకాదు, నీ అంతిమ లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయపడే ప్రత్యేకమైన సత్యాన్ని చదవడం చాలా ముఖ్యమని అయాన్ ర్యాండ్ చెబుతుంది.
పవన్ ! నీ ముక్కుసూటితనాన్ని, నీ పార్టీ ఆవిర్భావ ఉపన్యాసాన్ని నీ పుస్తకంతో తులనాత్మకం చేసినపుడు నాకు ఒకటనిపించింది. 90 శాతం వరకూ నీ ఇజం పుస్తకం ఒక దిశానిర్దేశం లేకుండా సాగింది. నీ రెండవ ఉపన్యాసంలో కూడా అది లోపించింది. నీ మొదటి ప్రసంగం కంటే విశాఖపట్నంలో చేసిన ప్రసంగంలో రాజు రవితేజ్ నిన్ను బాగా ప్రభావితం చేసుండొచ్చు. మార్షల్ ఆర్ట్స్ చేసే ఫైటర్ బ్రూస్ లీ కూడా మంచి తత్వవేత్త. 'జ్ఞానమనేది నిచ్చెనకున్న మెట్లలాగా ఎక్కేందుకు మనకు ఉపయోగపడాలి. ఒకసారి ఎక్కిన తర్వాత ఒక్కో మెట్టును నీ వెనుక వదిలేయాలి. కానీ, నీవు ఆ మెట్లను సేకరించుకుంటూ పోతే చివరకు నీవెక్కిన నిచ్చెన బరువెక్కి ఏదో ఒకరోజు పడిపోవచ్చు. కాబట్టి నువ్వు మోయాలనుకుంటున్న బరువుని ఎప్పుడూ కూడా మోసుకెళ్లకు' అని ఒకచోట బ్రూస్ లీ అంటాడు.
పవన్, నేనిక్కడ బ్రూస్ లీ ని పేర్కోవడానికి కారణం అతని ఉద్వేగాన్ని, చొరవచూపించే సచ్ఛీలత నీకు పంచాలనుకుంటున్నాను. బ్రూస్ లీ శైలి లో ఉన్న గొప్పతనం ఇతరుల చేత ప్రభావితమవడాన్ని అతను నిరాకరించడం. నీగురించి నీవు ఏమనుకుంటున్నావో, నీ తత్త్వాన్ని నీకు నీవుగా ఎలా వ్యక్తపరచాలో అర్థంచేసుకుంటావని ఆశిస్తున్నాను. నీమీద ఉన్న ఇతరత్రా దుష్ప్రభావాలను వదిలించుకుంటావని నీ శ్రేయోభిలాషిగా వేడుకుంటున్నాను. చివరిగా నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. నీ ఇజం గ్రంథంతో పూర్తిగా నిరాశ చెందాను. కానీ, పవనిజం మీద మాత్రం ఇప్పటికీ అమితమైన అంచంచల విశ్వాసంతో ఉన్నాను.
ధన్యవాదాలు
సదా నీ శ్రేయస్సును కాంక్షించే
రాం గోపాల్ వర్మ

Thursday, 27 March 2014

JanaSena party Book launch




ఈ రోజు సభ లో పవన్కళ్యాణ్ గుర్తు చేసిన   గుంటూరు శేషేంద్ర శర్మ గారు   దేశ భక్తి గీతం 

                     " పండుగరోజు"                                        

ఏడు కోట్ల పూలువిరిసి మురిసిన పండుగరోజు
విరుల తావు లచ్చరలై వియచ్చరలైన రోజు
నెల బాలుడు మిన్నులు దిగి నేలకు వచ్చినరోజు
కొమ్మల్లో కోయిలవై కుహుకుహు అన్నను
నదుల మతులు పులకరించి నాట్యం చేసిన రోజు
గట్లు త్రంచి సముద్రాల కౌగిలించుకున్న రోజు
ప్రభాత ప్రదోషాలు పసుపు కుంకుమలు చల్లిన రోజు

భావాలు రంగుల తోర్ణాలై ద్యోవా పృధుల మధ్య ఎగిరిన రోజు
మమత విశాల మానవతకు కర్పూర నీరాజన మిచ్చిన రోజు
ఉల్లిపార కాగితాన్నై ఊదా రంగు పులుముకొని
ఒక ఉజ్వల పతాంగాన్నై అనంత నీలిమలో విహరంచాను
ధరిత్రి తిరిగెను చరిత్రలో ఒక పేజీ పెరిగెను
చైత్రం విరిసిన తోటకు ఝంఝూ మరత్తు వచ్చెను
పూల గుండెలను హొలాహొల పూరితాలు చేశారు

వెన్నెలలు వెలార్చు విషజ్వాల రగిల్చారు
విరులు రాలి తరులు కూలి ఝరుల నీరు జారిపోయి
జీవకాంత లారిపోయి సుందర వందర లైతే
ఏ కొమ్మలు చేరి నేను ఏ గీతిక పాడతాను
ప్రపంచ విపంచి పంచమ స్థాయి నెట్లు చేరుతాను
రెండు యెదలు కలియు మాట రెండు య్దలు కలుపు చేత
పొదలించుము సోదరుడా చదలందున నీ చరిత్ర

రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైనా
లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా?
మూర్ఖుడు గడియారంలో ముల్లు కదలనీకుంటే
ధరాగమన మతటితో తలక్రిందై పోతుందా?
కుటిలాత్ముల కూటమికొక త్రుటికాలం జయముస్తే
విశ్వసృష్టి పరిణామం విచ్చిన్నం అవుతుందా?
దనుజలోక మేకంగా దారినడ్డు నిల్చుంటే
నరజాతి ప్రస్థానం పరిసమాప్త మవుతుందా?

మరి కొన్ని  ముఖ్య అంశాలు

మేమంతా కలిపి పిడికిడి మట్టే కావొచ్చు
కాని
ఎదరు తిరిగితే 'జాతీయ జెండా' కి ఉన్నంత పొగరు ఉంది .
కాంగ్రెస్ అనే అవకాశవాద వృక్షాన్ని వేళ్ళతో సహా పీకేయండి .
పవన్ కళ్యాణ్ తప్పుచేసినా సరే తల తీసేసే చట్టం రావాలి 
మీ కోసం ప్రాణాలు ఇవ్వలేనా ...ఇచ్చేస్తాను .
నాకు వ్యక్తుల మీద కోపం లేదు
వాళ్ళ ఆలోచనా విధానం మీదే ద్వేషం 
మేము గాంధీగారి సిద్డంతాలని నమ్ముతాం
అలా అని
ఒక చెంప మీద కొట్టేలోపు ..రెండు చెంపలు పగిలిపోయేలా కొడతాం ..
సమాజానికి ఉపయోగపడే 'యువనాయుకులు' దొరికిన రోజున
ఎన్నికల్లో పోటీ చేస్తాం .
వీళ్ళు రాజకీయనాయకులు కాదు ..వ్యాపారస్తులు మాత్రమే .
నాకు వోట్లను చీల్చడం ఇష్టం లేదు అందుకే పోటీ చేయడం లేదు
మీరు ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్ముతారో వాళ్లకి ఓటు వేయండి ..

Dear Narendra Modi
I would like to see you as the PM of Bharath Desh
You're going to be our PM. We support you, sir!

Friday, 21 March 2014

Today Pawan Kalyan Met Narendra Modi at Gujarat .

Speaking to press in Gujarath, Pawan Kalyan said, “I am here to give solidarity and support to Mr. Narendra Modi. Our country needs the leadership of Modi. I have met him and discussed what Telugu states needs when Modi becomes prime minister. I am not a politician. I am not here for power. I came here for the wellbeing of Telugu people. I have explained how badly the state is divided. He understood our problem. My party will support Narendra Modi."
Narendra Modi has tweeted, "Met Pawan Kalyan. This was our first meeting & I am impressed with his passion & commitment to serve the nation"



Tuesday, 18 March 2014

Thanikella Bharani About Pawan Kalyan's Political Entry



Pawan Kalyan's Jana Sena Party's Next meet

Pawan Kalyan's Jana Sena Party's Next meet @ Vizag on 27th..first public appearance.. With More than 1 Lakh People

The news of Pawan Kalyan’s first public meeting as the head of Jana Sena party is in the news since a couple of hours. As per the close circles of Pawan Kalyan, a huge public gathering is being planned on the 27th of this month at Vishakapatnam. And, this meeting will be having around one lakh of Jana Sena supporters attending it!
On the other hand, Jana Sena Party is in the process of meeting BJP leader Narendra Modi to discuss about the possibilities of an alliance between Jana Sena party and BJP party. The sources say that the meeting is going to happen on 20th of this month and an official announcement can be expected post the meet. Anakapalli, Kakinada, Vijayawada, Rajahmundry and Malkajgiri are among the constituencies which Pawan Kalyan is aiming at in the coming elections!

Sunday, 16 March 2014

17న మోడీతో భేటీకి పవన్ కల్యాణ్ కు అపాయింట్?


సినీ నటుడు, జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ ఈ నెల 17న బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 17న మోడీతో సమావేశానికి పవన్ కు అపాయింట్ మెంట్ ఖారారైనట్లు సమాచారం. ఈ మేరకు ద హిందూ ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిని పవన్ కల్యాణ్ ధ్రువీకరించాల్సి ఉంది. తాను కాంగ్రెస్ తో తప్ప ఏ పార్టీతోనైనా కలసి పనిచేసేందుకు సిద్ధమని పవన్ జనసేన ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాదు కాంగ్రెస్ కీ హటావో దేశ్ కీ బచావో అంటూ పవన్ సమావేశం ముగింపు సందర్భంగా తాననడమే కాకుండా అభిమానులతోనూ అనిపించారు. అంటే కాంగ్రెస్ ను పారదోలి దేశాన్ని రక్షించండని ఆయన కోరారు. ప్రస్తుతం నరేంద్రమోడీ కూడా ఈ దేశం నుంచి కాంగ్రెస్ ను తరిమేయాలంటూ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో పవన్ బీజేపీ, టీడీపీతో కలసి పనిచేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నట్లు హిందూ పత్రిక పేర్కొంది. రాజకీయాలపై తన అభిప్రాయాలతో పవన్ అతి త్వరలోనే పుస్తకాన్ని విడుదల చేయనున్నారని.. ఆ సందర్భంగానే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని భావిస్తున్నారు.

Saturday, 15 March 2014

పవన్ పిడుగులకి ఉక్కిరి బిక్కిరై ఊహ్యత్మకంగా మౌనం దాల్చిన తెరాస పార్టీ !

పవన్ పిడుగులకి ఉక్కిరి బిక్కిరై ఊహ్యత్మకంగా మౌనం దాల్చిన తెరాస పార్టీ !

Author : Gopi Chillakuru
ఎవరిని లెక్క చేయని ఆవేశం లో వున్న అగ్గి బరటా ను మరింత రగిలించి ఎందుకు వళ్ళు, ఇల్లు, వాకిలి తగల పెట్టుకొవడం అని . మొదులే ఎన్నికల సమయం అని గెలుపుల పై మాత్రమె ద్రుష్టి పెట్టడం మంచిదని సాక్షాత్తు కే సి అర్ పవన్ పై రెచ్చ గొట్టే విమర్చలు చేయవద్దని తెరాస ముఖ్య నాయకులను ఆదేశించినట్లు తెలుస్తుంది !
1) మొదులే శ్రీకాంత చారి తల్లి కి టికెట్ ఇవ్వక పోవడం ,ఒస్మానియా విద్యార్ది నేతలు టికెట్ల ఇవ్వని తెరాస పై వున్న ఆగ్రహం,మాములుగానే జంట నగరాల్లో తెరాస బలం తక్కువ .
2)హైదరబాద్ లో గతం లో జరిగిన ఉద్యమ హింస ఎడల భయం తో వున్న ప్రజలు,గతం లో తెరాస ఇబ్బంది పెట్టిన సినిమా నటులు,నిర్మాత లు వారందరూ మూకుమ్మడిగా పవన్ కు మద్దత్తు గా నిలుస్తారు అని తెలియటం .
3) హైదరాబాద్ లో పవన్ తో వ్యాపారస్తులు,వివిధ కంపెనీ లలో పని చేస్తున్న ఉద్యోగస్తులు,software ఉద్యోగస్తులు,విద్యార్దుల తండ్రి తండ్రులు, ఎక్కువ సంఖ్యలో జత కడితే ఇబ్బంది అవుతుంది అని తెలిసి
ఏమైనా సరే ఒక నెల ఎన్నికలు సమయం దాక మౌనం గా వుండి గోటి తో పోయే దాన్ని పరుషం గా మాట్లాడి గొడ్డలి దాక తెచ్చుకోవడం ఎందుకని మౌనాన్ని పాటిస్తున్నట్లు తెలుస్తుంది !
నిజంగా తెరాసా ఒక రాజకీయ పార్టీ గా సరిగ్గా అలోచిస్తున్నట్లే అనిపిస్తున్నది !

Friday, 14 March 2014

Pavan kalyan's Full Speech in Janasena Party Press Meet


గొప్పగా బతకాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి!
అదేంటో నాకెపుడూ పెద్ద పెద్ద సమస్యలు వస్తుంటాయి.
పిరికితనంతో.. నీ బాంచన్‌ దొర.. నీ కాల్మొక్తా అనే వాడిని కాదు కాబట్టి నాకు కష్టాలు వస్తాయోమో !
ఢిల్లీ వారి వద్దకు మన కాంగ్రెస్‌ నేతు వెళ్లి దొరా నీ కాల్మొక్త అని చెప్పి చెప్పి రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు
ఢిల్లీ వాళ్లు చేసిన పనికి అన్నయ్య మీద నేను ఎందుకు కోపం చూపిస్తా!?
తండ్రి తర్వాత తండ్రంతటి అన్నయ్యకు నేనెందుకు ఎదురెళ్తాను. ఇపుడు నా దురదృష్టం కొద్దీ అన్నయ్యకు ఎదురెళ్తున్నా తప్ప గుండెల్లో ఉన్న అన్నయ్యను ఎదురించడానికి కాదు.
ఏదో శుభ్రంగా సినిమాలు చేసుకుంటూ చాలీచాలని డ్యాన్సులు చేసుకుంటూ మీకు (ప్రేక్షకులకు) ఆనందం కల్పిద్దాం అంటే ఉండనివ్వట్లేదు. అందుకే మీ ముందుకు వచ్చాను. ఐదేళ్ల క్రితం గుంటూరులో ఆఖరి రాజకీయ ప్రసంగం చేశాను. ఆ తర్వాత ఎప్పుడూ రాజకీయాల గురించి, ప్రజా సమస్య గురించి గాని నోరు విప్పలేదు. అది నేను భగవంతుడికి వదిలేశాను. కానీ… నేడు రాష్ట్రం పరిస్థితి, తెలుగు వారి పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది.
కొందరు పదవుల కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాననుకోవచ్చు. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి కావాలని లేదు అవన్నీ నాకు తుఛ్చమైనవి. మీరు చూపించే అభిమానం ముందు, ప్రేమ ముందు అవి నిలవవు.
కానీ.. రాష్ట్ర రాజకీయాల గురించి గురించి, మన తెలంగాణ గురించి మన పోరు తెలంగాణ గురించి సీమాంధ్ర విడిపోయిన పరిస్థితులు గురించి. ఎలా విడగొట్టారో, ఎలాంటి పరిస్థితుల్లో విడగొట్టారో చూసి విసుగొచ్చింది. రాజకీయ నాయకుల మీద అసహ్యం వేసింది. ఒక నిర్దిష్టమైన ఆలోచన తోటి,ఒక సుదీర్ఘమైన లక్ష్యం తోటి మీ ముందుకు వచ్చి ఇలా పార్టీ పెట్టాను. దానిపేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, భారతదేశపు సేన. అదిగో అదీ జెండా (జెండా వైపు చూపిస్తూ).
….
ఇక తిట్లు, విమర్శలు, నోటి కొచ్చినట్లు తిడుతున్నారు. చూస్తా ఉన్నా, పౌరుషం లేదా, చేతకాదా చూద్దాం. భరిస్తాం. నేను పార్టీ పెడుతుంటే
ఇపుడెందుకు ?
ఇపుడు వచ్చి ఏం చేస్తావు?
2019 కి రా!
పోయిన సారి చేసిన రాజకీయాలు చాలు!
అని ఎన్నో మాటలన్నారు. ఇంకా చాలా ఉన్నాయిలెండి.

నేను రాజకీయం గురించి మాట్లాడతాను అని చెప్పాక..
క్షమాపణలు చెప్పమన్నారు. అది అడగడానికి మీరెవరు?
మీరెవరండీ చెప్పడానికి…!
ఢిల్లీ నాయకుడు ఒకాయన, అదే దిగ్విజయ్‌సింగ్‌ గారు ’పవన్‌ పార్టీ పెట్టమ్మా… కాంగ్రెస్‌ లో కలపమ్మా’ అన్నారు. అదేమన్నా గంగానదా? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను దిగ్విజయ్‌ సింగ్‌?
చివరకు ఒకాయన, అదే నేను అన్నయ్య తర్వాత బాగా అభిమానించే రెండో వ్యక్తి కేసీఆర్‌ అంటాడు (కేసీఆర్‌ సభల్లో అడిగే తీరులోనే పవన్‌ కూడా ఆయన పేరును అడిగినట్లు నటించాడు)
‘ఆంధ్రోళ్లు సంక్రాంతికి కొత్త దుకాణం పెట్టారు’ అంటూ విమర్శలు చేశారు.
”ముందు నన్ను చెప్పనీరాదే
చెప్పినాక నువ్వు తిడితే పడతా
నన్ను విమర్శించేవారందరికీ పేరు పేరునా చెబుతున్నా
”మీ విమర్శలకు భయపడతాననుకుంటున్నారా?
ఇలాంటి పిరికితనం అంటేనాకు పడదు
చచ్చిపోతా గాని భయపడను.

పార్టీ నిర్ణయం తీసుకుని ఒక ప్రెస్‌రిలీజ్‌ విడుదల చేశాక నాలో అనేక ప్రశ్నలు తలెత్తాయి.
”అరె నీకు రాజకీయాలు అవసరమా? సినిమాలు చేస్తున్నావు, నాలుగు డబ్బులొస్తున్నాయి హాయిగా చేసుకోకూడదూ… ఏదో తోటకు పోయి మామిడి చెట్టుకింద ఉండకుండా” అని ఇలా ఆలోచించాను. రూంలోకి వెళ్లి నా ముగ్గురు పిల్లలను చూశాను. ఒకరికి మూడు, మరొకరికి నాలుగేళ్లు. అబ్బాయికి ఏడెనిమిదేళ్లు ఉంటాయి. ’నేను వాళ్లని వదిలెళితే వాళ్లెలా ఉంటారు. అనిపించింది”

సైద్ధాంతిక బలంతోనే రాజకీయాలు చేయగలం. నాలాంటోన్ని చంపినా చంపేస్తారు. సమాజం కోసం నిస్వార్థంగా పనిచేయాలంటే ప్రాణాలకు తెగించాలి. నా దేశం, నా సమాజం ముఖ్యమా? నా కుటుంబం ముఖ్యమా? అనుకున్నపుడు నా కుటుంబం చిన్నదిగా అనిపించింది. నాకు వ్యక్తిగత శత్రువులు లేరు. నాకు కోపం వస్తుంది. కానీ దాచుకోను. అదప్పుడే ఆరిపోతుంది. కక్ష్య సాధించే మనసు లేదు.
నా నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించారు. నా మిత్రుడు త్రివిక్రమ్‌ శ్రీనివాసుతో సహా. నాకు అండగా నిలబడింది ఒకరే. వరంగల్‌ రాజు. చాలా మంది కామన్‌ మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏమైంది? అని అడుగుతున్నారు. వదిలేశాను అనుకున్నారు. వదిలేయలేదు. అది నా మనసులో ఉంది. ’సీపీఎఫ్‌ యే ’జనసేన’ అయ్యింది. నేను, రాజు ఇద్దరూ ఎంతో మధించాం. శోధించాం. రోజుకు ఏడెనిమిది గంటలు చర్చించే వారం. అప్పటికింకా పార్టీ ఆలోచన లేదు.
మీకు (అభిమానులకు) సినిమాల ద్వారా దూరమైతే అది నా తప్పు కాదు. నేను వాటిని వదులుకోవడానికి కారణం ఢిల్లీ వాళ్లు. మీ కోపం వారిమీద చూపండి (నవ్వుతూ).

పార్టీ నిర్ణయం తర్వాత ఏం చేయాలి? ఎక్కడికెక్కాలి? అని తీవ్రంగా ఆలోచించాను. నా చిన్నప్పటి అమ్మమాట నాకు ఎప్పటికీ గుర్తే.
”మతి ఎంతో గతి అంతే” అని మా అమ్మ అనేది.
నా సామాజిక స్పృహకు కారణం… ఓ చిన్నప్పటి సంఘటన. స్కూలు తెరిచాక చాలా రోజులకు గాని పుస్తకాలు రావు. ఆ సందర్భంలోనే ఒక చిన్న సంఘటన వల్ల పోలీసు స్టేషనుకు వెళ్లాను. నెల్లూరు టూ టౌను పోలీస్‌స్టేషను అనుకుంటా. మూడు నాలుగు గంటలున్నా. మా నాన్న పోలీసు. అయినా వారికి తెలియక నన్ను వదల్లేదు. ఆ తర్వాత ఒక ఎస్సై వచ్చారు. ఆయన నెత్తిమీద రెండు కొట్టి పంపించేశారు.
ఒక సామాన్యుడి బాధ ఏంటో అపుడే తెలిసింది.
….
చదువు మీద ఆసక్తి పోయి పరిశీలన మొదలుపెట్టాను . బయట ఒకటి, లోపల ఒకటి మాట్లాడేవారిని చూస్తే నాకు చాలా వింతగా ఉంటుంది. ఏంటో ఈ లోకం. అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. విచితంగా జరుగుతుంటాయి. ఒకసారి మా అక్క నేను బయటకు వెళ్తే ఒకడు అక్క చేయి పట్టుకున్నాడు. అపుడు నేను చిన్నోడిని. అర్థం చేసుకునే శక్తి లేదు. ఎవరో అక్కను కాపాడి ఇంటికి తీసుకువచ్చారు. ఒక ఆడపిల్ల బయటకు వెళ్తే క్షేమంగా తిరిగి ఇంటికి రాలేదా? మన సమాజం డబ్బున్నోళ్లకి, పరపతి ఉన్నోళ్లకి తప్ప సామాన్యులను రక్షించదా?

పదో తరగతిలో విప్లవ సాహిత్యం చదివాను, సాయుధ పోరాటాలు చదివాను. అపుడే తెలంగాణ సాయుధ పోరాటం గురించి చదివాను. కొంతమందిలా ’కొత్తగా ప్రేమొచ్చి’ చదవలేదు. దీంతో ఇక్కడుంటే చెడిపోతాను అని ఇంట్లో వాళ్లు మద్రాసు పంపారు. స్థలం మారింది, ఆలోచన మారితే కదా అదే బుద్ధి. అక్కడ ఒక గొడవ జరిగింది. డీఎంకే నాయకుడు ఒకరు సెటిల్‌ చేశారు. తిరుగుబాటు పోలేదు అని చెప్పడానికి ఈ ఉదాహరణ చెబుతున్నాను.
అందరూ నేను ఏం చేయకపోయే సరికి ఊరికే తిడుతుండే వారు. లోపల ఏదైనా చేయాలని చాలా ఉండేది. ఆలోచన, ఆవేశం ఉంది…. చేసే సామర్థ్యాలు లేవు. చిన్నపుడు కోతికొమ్మచ్చి ఆడాను. అంతే అవి తప్ప నాకు ఆటలు కూడా తెలియదు. ఆ తర్వాత ఇప్పటి వారికి ఆ అలవాటు కూడా లేదనుకోండి.. ఎందుకం మనోళ్లు ’చెట్లు కొట్టేశారు. చెట్లుంటే కదా కోతికొమ్మచ్చి ఆడేది’.
నాకు ఏదీ మనశ్శాంతిగా ఉండేది కాదు. కోపంతో మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నా అయినా ఫలితం దక్కలేదు. యోగా, ధ్యానం నేర్చుకున్నా ఉపయోగం లేదు. ఎపుడూ బాధలు, సమస్యలు కనిపిస్తుంటే మనశ్శాంతి ఎలా వస్తుంది? ఒకసారి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నా. మంచి అన్నయ్యలు ఉండటం వల్ల అలా జరగనివ్వలేదు. నా అశాంతి గురించి వారికి చెబితే ’తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండి, అన్నీ ఉంటే నువ్వు ఇలా ఎన్నికథలన్నీ చెప్తావనేవారు. అపుడు అనిపించింది. ఒకవేళ నేను ఏదో ఒకటి సాధించినా నాలో ఇలాంటి ఆలోచనలే ఉంటాయా అని?అదే ఆలోచన నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టింది.
రేపు పొద్దున నా పిల్లలు ఏమవుతారో తెలియదు. అన్నిటినీ వదులుకుని వచ్చాను. దేశంపై ప్రేమతో, సమాజం పట్ల బాధ్యతతో. రాజకీయాలు ఉన్నది సమస్యలు పరిష్కరించడానికి గాని వాటిని మరింత జఠిలం చేయడానికి కాదు.. నాకు ప్రతి పార్టీలోనూ కాంగ్రెస్‌తో సహా పలువురు నాయకులు తెలుసు. వారితో మాట్లాడుతా. కలిసినపుడు కౌగిలించుకుంటాను కూడా. కానీ వాళ్లతో సైద్ధాంతికంగా నేను ఏకీభవించలేను. వాళ్ల ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ఇపుడు పార్టీ పెట్టాం. ప్రతి పార్టీని, అందరు నేతలను ఎదుర్కొంటాం.

తెలంగాణకు వ్యతిరేకం కాదు. కానీ ఘోరంగా విభజించారు. సీమాంధ్రను అవమానించారు. నేను ఊరుకునే వ్యక్తి కాదు. అందుకే వచ్చాను. భగత్‌సింగ్‌ తెలుసుకదా మీకు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఉరితీస్తామన్నారు. చివరకు మన గాంధీ కూడా క్షమాపణ అడుగు వదిలేస్తారు అన్నాడు. కానీ భగత్‌సింగ్‌ వినలేదు. ’నేను రాబోయే తరాల కోసం చస్తున్నా. నా కోసం కాదు. నేను ఎందుకు చనిపోయానో వారికి తెలియాలి. నేను క్షమాభిక్ష అడగను’ అని గాంధీకి కూడా చెప్పారు. అంత చిన్న వయసులో భగత్‌ సింగ్‌ తన గురించి, తన దేశం గురించి, తన భారత భావి పౌరుల గురించి ఆలోచించారు. ఆయన స్పూర్తే నేను !! ఆయన స్ఫూర్తి నాలో ఉంది. భగత్‌ నేను ఉన్నాను మీ ఆశయాలతో!
..
ఇక పార్లమెంటులో జరిగిన ఘోరం గురించి ఏం చెప్పాలి? రాజ్యసభలో వెంకయ్యనాయుడు సీమాంధ్ర కోసం ఎన్నో పాట్లు పడ్డారు. ఆయన జై ఆంధ్ర నాయకుడు. ఆయన తపన నాకు నచ్చింది. నేను ఆయన గురించి ఇలా అనుకుంటే ఆయన నా గురించి ఏమనుకున్నారో మీకు తెలుసా? ‘పవన్‌ పాలిటిక్స్‌ లోకి వస్తాడంట దేశానికి ఇది దౌర్భాగ్యం కాకపోతే మరేంటి?” అన్నారు. వెంకయ్యగారు మీరింత అనుభవజ్ఞులై ఉండి ’ఎంతో గౌరవంగా తేవాల్సిన మన తెలంగాణను మీరెలా తీసుకువచ్చారో మనం చూశాం.. అది కాదా దేశానికి పట్టిన దౌర్భాగ్యం.?”
నాకు నచ్చింది జగ్గారెడ్డి గారు. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుందాం అనే విషయాన్ని నిజం చేయగలిగిన వారాయన ఒక్కరే. ఆయన నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగి ఉంటే అది సాధ్యమై ఉండేది.
నాకు ఇష్టమైన మరో వ్యక్తి వి.హనుమంతరావు. విభజన సమయంలో ఆయన బస్తీల్లో తిరిగి సీమాంద్రులకు అభయం చెప్పారు. మీకేం కాదన్నారు. అది నాకు నచ్చింది. ఆయన గురించి నేను ఎంతో సంతోషపడ్డాను. మరి నేను ఆయన గురించి ఇలా ఆలోచిస్తే ఆయన నా గురించి ఏం ఆలోచించారో తెలుసా? ”వాడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తాడు? మా రాహుల్‌ గాంధీ ఒక్క పెళ్ళి కూడా చేసుకోలేదు.” అన్నాడు. ఆ వాక్యంలో నాకు ఒకటి అర్థమైంది. ’రాహుల్‌ గాంధీకి పెళ్లి కాలేదు గాని బ్రహ్మచారని చెప్పలేదు’. హనుమంతురావు గారూ…. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే రాజకీయాలకు పనికిరారు అంటున్నారు. ఒకే పెళ్లి చేసుకుని 30 మందితో తిరగొచ్చా? లోనవాలా రిసార్టులో అలా తిరిగిన వారు ఎవరో మీకు తెలియదా? నా వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తే మీ వ్యక్తిగత జీవితం బయటకు వస్తుంది. ”రాబర్ట్‌ వద్రా, రాహుల్‌ గాంధీ నుంచి మొదలుకొని ప్రతి నాయకుడి వ్యక్తిగత జీవితం బయటకు తీస్తా. మీకు సీబీఐలు కావాలేమె నాకు అభిమానులు చాలు. ఒక నెంబరు ఇస్తే అన్నీ నా దగ్గరకు వస్తాయి”. ఏ పార్టీకి చెందిన వారయినా సరే, ఏ రంగం వారయినా సరే, నా వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తే నేను వారి వ్యక్తిగత జీవితాలు బయటకు తీస్తాను. ఇంటర్‌నెట్‌ ఉంది. ఫేస్‌ బుక్‌ ఉంది. ట్విట్టరు ఉంది, యూట్యూబు ఉంది. మీకు ఓకేనా. నేను లోపల కూడా ఎవరినీ విమర్శించను. ప్రజా జీవితానికి వ్యతిరేకంగా ఉంటే విమర్శించకుండా వదిలిపెట్టన.
‘ఒకరి ఇంట్లో ఏం జరుగుతాయో ఎవరికీ తెలియవు. మీకు తెలియని విషయాలను బయట నుంచి చూసి విమర్శించకండి. నా జీవితంలో ఏ పరిస్థితుల్లో విడిపోయానో, ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నానో మీకు తెలుసా? ఆ స్త్రీలకు వ్యక్తిగత జీవితాలు ఉండవా? వారిని ఎందుకు అగౌరవపరుస్తారు. ఎందుకు వారి మనసు బాధపెడతారు?

పొద్దున్నే చూశా… జన జాగృతి అధ్యక్షురాలు కవిత ఏమన్నారంటే పవన్‌ కళ్యాణ్‌, నువ్వు ఒక భారత పౌరుడిగా నీకు పార్టీ పెట్టే హక్కుంది గాని. ముందు తెలంగాణకు క్షమాపణ చెప్పాలి’ అంది. అవును నేను ప్రేమించే తెలంగాణ ప్రజలకు, అభిమానులకు నేను క్షమాపణ చెప్పాలా, లేదా?అన్నది మా వ్యక్తిగత విషయం. అది మీకు సంబంధం లేదు. ’అమ్మా కవిత, తల్లీ నువ్వు నా చెల్లెలి లాంటి దానివి. ఒక అన్నగా నీ బాధను అర్థం చేసుకున్నాను. నీ అసలు అన్నయ్య కేటీఆర్‌ భావావేశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఒక తెలంగాణ ప్రజా సంఘాల నాయకుడు నాకేం చెప్పారో తెలుసా! కవిత చాలా విరాళాలు సేకరించారు అన్నారు. నా ఎన్నారై మిత్రులు కూడా మేము కూడా పంపామని చెప్పారు. మీరు దయచేసి ’ఆ సంస్థ విరాళాల వివరాలు, అక్కౌంట్లు తెలంగాణ ప్రజా సంఘాలకు చెప్పండి.

నేను గత ఎన్నికలపుడు గాంధీభవన్‌ వెనుక భీంరావ్‌ గూడ లోకి వెళ్లాను. ఈ కాంగ్రెస్‌ నాయకులు ఏం చేశారో తెలుసా? వారిని ఖాళీ చేయించారు. అభివృద్ధి కోసం ఖాళీ చేయించడం తప్పుకాదు. కానీ వారు ఖాళీ చేయించింది. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం కోసమట. నేను అక్కడికి వెళ్లినపుడు’అప్పుడే వండుకున్న అన్నం, ఒక దేవుడి ఫొటో’ కింద పడి ఉంది. హృదయం ద్రవించింది. కాంగ్రెస్‌ పెద్దలారా? మీకు అదే స్థలం కావాలా? హైదరాబాదులో చాలా ఖాళీ ఉంది. దోచుకున్న డబ్బులున్నాయి కదా.. పెద్దపెద్దవి కట్టుకోండి. చిన్న గుడిసెల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. వారు మనసులు అంతగా గాయపరచాలా?
‘ఖాళీ చేసిన వారు వేరే స్థలాలకు వెళ్లాక నేను అక్కడికి వెళ్లాను. ఒకావిడతో మాట్లాడితే మనసు గాయపడింది. ఆవిడకు ఒక కూతురు ఉంది. బాత్‌ రూం లేదు. నా బిడ్డ స్నానం చేస్తుంటే చూసి అక్కడి కొందరు అల్లరి మూకలు అల్లరి పెడుతున్నారంట. ఇదీ కాంగ్రెస్‌ నిర్వాకం. మన ఢిల్లీ పెద్దలు ఎంత దౌర్భాగ్యులంటే స్వాతంత్య్రం వచ్చాక అరవై ఏళ్లకా నిర్భయ చట్టం? ఇంతకాలం ఏం చేశారు. ఒక ఆడపిల్లను నలుగురు అత్యంత పాశవికంగా నాశనం చేస్తే గాని మీకు తెలిసి రాలేదు. అది కూడా ఢిల్లీలో జరిగి ఉండకపోతే ఇప్పటికీ ఆ చట్టం వచ్చేది కాదు.
ఈ నాయకులు ఎంత దుర్మార్గులంటే అపుడు వరంగల్‌లో స్వప్నికపై యాసిడ్‌ దాడి జరిగింది. ఆమె కాలిపోయిన శరీరంతో బాధపడుతుంటే ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు. వీళ్లు మనుషులా? అక్కడ రాజకీయాలు, ఫొటోలు, స్టిల్స్‌. నేను కూడా అక్కడికి వెళ్లాను. కానీ లోపలకు వెళ్లలేదు. ఆమెకు ఎవరో చెబితే రమ్మని చెప్పింది. నేను వెళ్లినపుడు ఆమె అడిగింది ఒకటే…’ఏ ఆడపిల్లలకు ఇలా జరగకుండా చూడండి’ అని!!!
అసలు వీళ్లకు చట్టసభలంటే ఏమైనా గౌరవం ఉందా? వాటి గౌరవాన్ని ఎంత దారుణంగా పాడుచేశారంటే… పార్లమెంటులో బయట కూడా మాట్లడలేనంత నీచంగా మాట్లాడుతారు. ఈ నాయకులు పాలించే వారు కాదు. వేధించే వారు. ఒకసారి నల్గొండ ఫ్లోరైడు బాధితులకు మంచి నీళ్లు ఏర్పాటుచేద్దామని అభిమానులు ప్రయత్నిస్తే మీది ఏ పార్టీ అని అడిగి అడ్డుకుంటారు. వీళ్లా నేతలు.
….
ఒకసారి ఒక తెలంగాణ వ్యక్తితో నేనే స్వయంగా తిట్లు తిన్నా. తిడుతుంటే… నాకు ఒక విషయం అర్థమైంది. ఆయన బాధ నామీద కాదు. దశాబ్దాలుగా వారు చూస్తున్న అవ్యవస్థ మీద. నాకు విషయం అర్థం అయ్యింది. అర్థం చేసుకుని అడగబోతే ఆయన ఏమన్నాడో తెలుసా…. ’నీ యమ్మ ఆంధ్రోడి బుద్ధులు చూపిస్తున్నావా” అన్నాడు. అయినా నాకు కోపం రాలేదు. ఎందుకంటే నాకు వాస్తవం తెలుసు. ఆంధ్రులను ఎలా చూస్తున్నారంటే దక్షిణ అమెరికా అర్జెంటీనాలో ఉండే చెగువేరా ఫొటో పెట్టుకునే హక్కుంది. కానీ ’కొమరం భీం’ ఫొటో పెట్టుకోకూడదా..? ఈ కోపం వారికి నా మీద కాదు,దశాబ్దాల అణచివేత నిర్లక్ష్యం మీద.

2009కి మునుపు తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగేవాళ్లం. ఇపుడు ఎంత దారుణంగా తయారైంది పరిస్థితి…. ’సెట్లు తగలబెట్టడం.. బెదరించడం’ ఇది తెలంగాణ ప్రజలు చేసింది కాదు రెచ్చగొట్టే తెలంగాణ నాయకులు చేసింది. ఇలా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటే బయటివాడు వచ్చి మనల్ని దోచుకుంటూ ఉంటాడు. చైనా వాడు వచ్చి అస్సాంను, పాకిస్తానోడు వచ్చి కాశ్మీరును తీసుకెళ్తాడు.
కొంతకాలం కిందటి మాట. ఒక వైపు సీమాంధ్ర ఉద్యమం ఉధృతంగా అవుతోంది. ఇద్దరూ కొట్టుకుంటూ ఉన్నారు. అది చూసి ఏం చేయలేకమధ్యలో నేను నలిగిపోతున్నపుడు కొందరు నేతలు అక్కడి నుంచి వచ్చారు. మీరు వచ్చి సీమాంధ్రకు నాయకత్వం వహించండి. అక్కడ నాయకత్వం వహించడానికి ఎవరూ లేరు. ఇపుడు మీరొస్తే సీఎం అయిపోతారు… అని చెప్పారు. ’ఎట్లా పోగలను. ఈ పదవులు, అధికారాలు సమాజ హితవు కోరుకునే వాడికి సంతోషమిస్తాయా?
నన్ను ఎవడైనా ఆంధ్రోడంటే బాధ కలుగుతుంది. నేను భారతీయుడిని, నాకు కులం, మతం, ప్రాంతం లేదు.
పొద్దున్నే పేపర్లో చూశాను కాపులు పవన్‌ కళ్యాణ్‌ను ఒప్పుకోవట్లేదు అన్నాడు ఒకాయన. మీరెవరు నన్ను ఒప్పుకోవడానికి? నేను మిమ్మల్ని అడిగానా? ఇన్ని కోట్ల మంది తెలంగాణ ప్రజలు నాకిచ్చిన అభిమానాన్ని నేను ఒక వర్గానికి తాకట్టుపెడతానా ? అలా చేయగలడా నాలాంటి వాడు?

ఈ దేశం సనాతన ధర్మంతో నడుస్తుంది, ఇది కర్మభూమి. మహానుభావులు పుట్టిన భూమి. రక్తపాతాలు జరిగేలా ప్రాంతాల కోసం ఇక్కడ కొట్టుకోరు. ప్రజలను విడదీయాలని చూస్తే నాశనమైపోతారు. నేను కూడా చూస్తూ ఊరుకోను. అలా చేసే వారి తాటతీస్తాను. ఒబామా ఈరోజు అమెరికా అధ్యక్షుడు అయ్యాడంటే ఎందరో నల్లజాతి యోధుల పోరాటాలే కారణం. అమెరికాకు చెందిన మార్టిన్‌ లూథర్‌కింగ్‌ను నెహ్రూ ఒకసారి ఇండియాకు ఆహ్వానించారు. అపుడు ఆయన ముంబై వచ్చారు. అక్కడ పక్కపక్కనే ఆకాశహార్య్మాలు-మురికివాడలు ఉండటం చూసి ఇంత అసమానత ఉన్నా కూడా ఇక్కడి ప్రజలు కొట్టుకోకుండా, సంతోషంగా గడిపేస్తున్నారు. ఇలా మాదేశంలో ఉంటే రక్తపాతాలు జరిగేవన్నారు. ఇది కర్మభూమి. అలా జరిగే అవకాశం లేదిక్కడ.
నాయకులకు చెబుతున్నా ’ఎంత మంది రెచ్చగొట్టినా ఇక్కడ ప్రజలు విడిపోరు. అవి మీ పగటి కలలు. ఇలాగే మీరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే మీరు నాశనమైపోతారు. మీరు విడగొట్టగలిగింది ప్రాంతాలను మాత్రమే’.

కొందరు అంటున్నారు మా భాషను అవమానించారు అని ఇక్కడ బమ్మెర పోతన చక్కటి తెలుగులో రాసిన ఓ పద్యం చదివి ఇది కూడా తెలంగాణ భాషే. యాసే. మీరు రెచ్చగొట్టే భాష మాత్రం కాదు. ’నెత్తులు పగులుతాయి? నాలుకలు కోస్తాం, బొక్కలు పగలకొడతాం’ ఇదా తెలంగాణ భాష? కానే కాదు. దీని గురించి కంచె ఐలయ్య స్పందిస్తూ ఈ మాటలన్నీ భూస్వామ్య దురహంకారానికి నిదర్శనం అన్నారు. మేము అవమానించే వాళ్లమా? గద్దరు నెల్లూరు టౌను హాల్లో ’బండెనక బండికట్టి నీ ఘోరీ కడతాం కొడకో నైజాం సర్కారోడా’ అని పాడితే గంతులేసిన మనిషి నేను ”భావం ముఖ్యమా? భాష ముఖ్యమా?” చెప్పండి
ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, నెల్లూరు, రాయలసీమ, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి గొప్ప వాళ్లు వచ్చారు. ఎవరెక్కువ అని అడిగితే ఏమని చెప్పగలం. అందరూ ఎక్కువే. అందరూ గొప్పవాళ్లే. గొప్పవాళ్లు పుట్టారు, పుడుతూనే ఉంటారు అన్ని చోట్లా, అన్ని ప్రాంతాల్లో.
ఇలాంటి ’ఎవరెక్కువ’ రెచ్చగొట్టే పద్ధతి మానుకోండి, వీటిలోనూ రాజకీయాలు మానుకోండి. విడిపోయిన తరువాత బూతులు తిడితే బంగారు తెలంగాణ రాదు. కేసీఆర్‌ గారు మీరు ఎకరాకు కోటి ఎలా సంపాదిస్తున్నారో తెలంగాణ రైతులందరికీ చెప్పండి. వారు సంపాదించుకుని బాగుపడతారు. అపుడు అందరూ మీకు జైకొడతారు. నేను కూడా !
తెలుగు ప్రజలు ఎమోషనల్‌ ఫూల్స్‌ . వారు నమ్మితే బాగా నమ్ముతారు అంతే. దేశంలో ఎమర్జెన్సీ విధించినపుడు దేశమంతా ఓడిస్తే కాంగ్రెస్‌ వల్లేను తెలుగువారు గెలిపించారు. అలాంటి తెలుగు వారికి ఇలాంటి దుస్థితి తెచ్చింది ఆ పార్టీ.
మీరు తెలంగాణ ఇచ్చే మనుషులు కాదా? మీకు నిజంగా తెలంగాణ ఇవ్వాలనుంటే 2009 నుంచే మొదలుపెట్టాల్సింది. తెలంగాణ ఇవ్వాలంటే ఇంతమంది చావాలా? అంతమందికి కడుపుకోత అవసరమా? అంతమందిని ఎం దుకు చంపారు? మీరెందుకు బాధ్యతగా భావించలేదు. రాహుల్‌,సోనియా సీమాంధ్రకు వెళ్లి ఇదిగో తెలంగాణ ఇవ్వాలనుకుంటున్నాం, మీకు ఏమివ్వాలో చెప్పండి, అని ఎందుకు అడగలేదు.
మీరిచ్చిన తెలంగాణ ఎలా ఉందంటే వీళ్లకీ సంతోషం లేదు. వాళ్లకీ సంతోషం లేదు. రాజధాని ఉమ్మడిగా ఉంచారు. తెలంగాణ వాళ్లు వద్దంటున్నా భద్రాచలం ప్రాంతాలను సీమాంధ్రలో కలిపారు. వారికేమో రాజధాని లేకుండా చేశారు. దానికేం చేయాలో అర్థం కావట్లేదు ప్రజలకు. ఇపుడున్న నాయకులపై నమ్మకం లేదు. అభయహస్తం (కాంగ్రెస్‌ గుర్తు) వెన్నుపోటు పొడిచింది.
….
ఇది నిరంకుశ కాంగ్రెస్‌. అప్పులతో కూరుకుపోతున్న దేశాన్ని బతికించింది ఎవరు? మన తెలుగు వాడు పీవీ నరసింహారావు. ఆయనకు అంత్యక్రియలు కూడా సరిగా చేయలేదు. ఆ ఢిల్లీ పెద్దలకు ఆయన నచ్చలేదు. ఇక్కడి కాంగ్రెస్‌ తెలంగాణ నేతలకు ఆయన నచ్చలేదు. ఏమిటిది? వీరు ఈరోజు తెలంగాణను పునర్నిర్మిస్తాం అని చెబుతున్నారు.
రాహుల్‌ కు ప్రధాని అవ్వాలనుంది. ఆయనకు నిజంగా ఆ కోరిక ఉంటే వాళ్ల అమ్మమ్మ నుంచి రాజకీయం నేర్చుకోవాలి. ప్రజలతో మెలగడం ఆమె నుంచి నేర్చుకోవాలి. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం జరుగుతుంటే అప్పుడు ఆ శాఖా మంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ వారి మనసు తెలిసి మసలుకున్నారు. తప్పును దిద్దుకున్నారు. అదీ నాయకత్వం అంటే.
జైరాం రమేష్‌ను మౌంట్‌ బాటన్‌తో పోలుస్తూ కాంగ్రెస్‌ పాలిటిక్స్‌ కు నిలువెత్తు నిదర్శనం ఆయన. సీమాంధ్రకు పోతాడు ’నేను వ్యక్తిగతంగా తెలంగాణకు వ్యతిరేకిని. కానీ ఇచ్చేశాం అంటాడు. మళ్లీ ఇక్కడికి వచ్చి…. తెలంగాణలో మాట్లాడుతూ ’యూటీ గురించి చిరంజీవి మాట్లాడితే తలపట్టుకు కూర్చున్నా’ అంటారు. మీరు వాస్తవంలోకి రండి. మేము మీ నాటకాలు చూసి అలసిపోయాం.
నాకు వారి మీద కోపం. నేతల మీద కోపం, అవ్యవస్థ మీద కోపం. తిరుగుబాటు చేసి ఎండగట్టాలనుంది. అందుకే వచ్చాను.
సోనియా గాంధీతో సహా ఎవరినీ వదిలిపెట్టను. ఎవరైనా కానివ్వండి. జాతీయ సమగ్రతను చెడగొట్టినట్టు తెలిస్తే ఊరుకోను. మీర జిహాదీలను చూశారు. ఒక ప్రాంతం కోసం చచ్చే వారిని చూశారు. కానీ దేశం కోసం చచ్చిపోయే మొదటి వాడిని నేనే. గుర్తుపెట్టుకోండి.
‘పాతబస్తీ నుంచి కొందరు ముస్లింలు వచ్చారు. వాళ్లు నన్ను అడిగారు. ’మా ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, అక్బరుద్దీన్‌ హిందువులను తిడితే దేశ సమగ్రతకు భంగం కలిగించినందుకు కేసు పెట్టారు. కేసీఆర్‌ తిడితే ఆయన ఎందుకు కేసు పెట్టరు. మరి హిందువులను ముస్లింలు తిడితే దేశ సమగ్రతకు భంగం కలిగింది. హిందువులు-హిందువులు తిట్టుకుంటే సమగ్రతకు భంగం కలగదా?
ఒకటే చట్టం… రెండు రకాలుగా ఎలా పనిచేస్తుంది?
అది న్యాయ వ్యవస్థ చెప్పాలి. సుప్రీంకోర్టు చెప్పాలి. దానికి నా దగ్గర సమాధానం లేదు.
………….
జనసేన లక్ష్యాలు ఇవి;- 
అన్ని వర్గాలకు, పెద్దలకు, పేదలకు చట్టం ఒకే విధంగా పనిచేయాలి 
బ్లాక్‌ మార్కెట్‌ (నల్ల బజారు) క్రమక్రమంగా నిర్మూలన 
వాతావరణ కాలుష్యం మీద పోరాటం! 
స్త్రీకి స్వాతంత్య్రం, రక్షణ, గౌరవంతో కూడిన భద్రత 
వైద్యం సర్కారు ఆస్పత్రిలోనే కార్పొరేటులాగా అందించడం 
జనసేన ఐడియాలజీ కులమత ప్రాంతాలకు అతీతం
ఇపుడు డబ్బుల్లేవు. పార్టీ పెట్టడానికి అయిపోయాయి. వచ్చే రెండేళ్లలో పార్టీ నిర్మాణం పూర్తిగా జరుగుతుంది. బాధ్యత వహించే యువ నాయకుల కోసం నేను వెతుకుతున్నాను
దేశం కోసం మాత్రమే పనిచేస్తుంది. వేలకోట్లు సంపాదించుకోవడానికి రాలేదు, టీవీలు పెట్టడానికి రాలేదు. ప్రజా ధనం దోచేస్తే ఊరుకోను. నా దగ్గర గూండాల్లేరు. మీరున్నారు (అభిమానులు) చాలు. సైద్ధాంతిక బలం ఉన్న మీరు చాలు. అట్నుంచి ఇటు దూకే వాళ్లను నా పార్టీలో పెట్టను. జోకర్స్‌,జంపర్స్‌ నాకు వద్దు.
ఇంకా చెప్పాలంటే నాకు టీఆర్‌ఎస్‌ నాయకులంటే అంతో ఇంతో గౌరవం ఉంది. వారు ఒకేసిద్ధాంతంతో పోరాడారు.

కాంగ్రెస్‌ తో తప్ప దేంతో అయినా చేతులు కలుపుతా
ముందు ప్రజలు సుఖంగా ఉండాలి. బందులు ఆగాలి. పది మంది బాగుండాలి. ఇలాంటి కొన్ని సిద్ధాంతాలున్నాయి. వాటిపై అందరు నాయకులతో మాట్లాడతాను. ప్రతి ఒక్కరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాను.
జైరాం రమేష్‌, షిండే , చిదంబరం, వీరప్ప, ఆంటోనీ, యావన్మందీ కాంగ్రెస్‌ నేతలూ వినండి…
తెలుగు ప్రజల తరఫున, దేశ ప్రజల తరఫున చెబుతున్నా, దేశానికి పిలుపునిస్తున్నా.
”కాంగ్రెస్‌ హఠావో దేశ్‌ కీ బచావో”
జై హింద్‌.

పవన్ సంధించిన బుల్లెట్లు !

పవన్ సంధించిన బుల్లెట్లు !(దగాపడిన తెలుగు సోదరుడి మదిలో ప్రశ్నలే పవన్ సంధించిన ప్రశ్నలు !(బుల్లెట్లు))
Author : Gopi Chillakuru
 14/03/14: పవన్ ప్రసంగం దాదాపు రెండు గంటలు ఆద్యంతం ఎంతో హుందాగా,ఆందోళనతో కూడిన ఆవేశం గా సాగింది . తను చెప్ప దలుచుకోంది,మనసులో వున్నది నిబ్బరంగా,స్పష్టముగా హైదరాబాద్ నడిబొడ్డున చెప్పాడు . ఐదు సంవత్సరాలుగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తోడబుట్టిన అన్నయ్యని విమర్శించలేక తనలో తను పడుతున్న బాధను ఒక్క సారిగా పంచుకొన్నాడు ! తను కూడా అందరి లాగే నిస్సహయం గా ఎటూ తేల్చుకోకుండా ఉండలేక పోయాను అన్నారు .
నాకు సమాజం బాగుండాలని కోరిక కానీ ఎంపీ నో మంత్రి గానో ,ముఖ్యమంత్రి నో అవ్వాలని నాకు లేదు ఇవన్నీ నా దృష్టిలో త్రుచ్చం అని మొదటే చెప్పాడు !
సినిమారంగం వారి పై తెలంగాణా ఉద్యమ ముసుగులో జరిగిన దాడులను,నిర్మాతల ,దర్శకుల హీరోల భాదలను సున్నితంగా చెప్పకనే చెప్పాడు . తనతో వున్న ప్రాణమిత్రులు కూడా ఈ ఉద్యమ రాజకీయం వల్ల నన్ను ఆంద్రోడివి (ఇది సీమంద్ర మిత్రులందరికీ అనుభవమే) అని చేసిన లొల్లిని అపనమ్మకాన్ని కూడా పంచుకొన్నాడు .
తెరాస నేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ తెలంగాణ యాసలో ఇతర నేతలను కించ పరిచే తీరును అయన యాసలోనే ఎత్తి పొడుస్తూ "జరా ఆగరాదే నేను చెప్పింది విని మాట్లాడ రాదే" ఎలాగు ఇక మీదట మన మాటల పోరు ముందుంది కదా అని మెత్త గా మొత్తి చెప్పాడు . ఆయన పై తెలంగాణా ఉద్యమ సారధిగా తనకు గౌరవం వుంది అని ప్రకటించాడు
కల్వకుంట్ల కవితమ్మ వసూళ్ళకు కూడా లెక్కలు అడిగేశాడు చెల్లెమ్మ తో సమానం అంటూనే మర్యాదగా కడిగేసాడు .జాగ్రత్త గా ఉండకపోతే ముప్పు తప్పదు నేను ఎవరిని లెక్క చేయను అని చెప్పేసాడు .
సీమాంద్ర వాళ్ళని నాలిక కోస్తాము ,చంపుతాము నరుకుతాం అని బెదిరించే వారి పై కేసులు ఎందుకు పెట్ట లేదు ఒవైసి మీద కేసులు పెట్టిన వారికి ఇవి నేరపూరిత మాటలు అనిపించలేదా అని గట్టిగా ప్రభుత్వాన్ని (మెత్తగా వున్న BJP ని కూడ విమర్చించినట్లే ) ప్రశ్నించాడు !.
తెరాస మీద విరుసుకు పడే సంగారెడ్డి శాసన సబ్యులు జగ్గారెడ్డి ని ఉత్తమ సమైక్య వాదిగా పేర్కొని ఇటువంటి నాయకులూ తెలంగాణా కు కావాలి అని మనసులో మాట చెప్పారు (కాని అయన కాంగ్రెస్ లోనే ప్రముఖ నాయకుడిగా వున్నాడు ) . కాని లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ గారు ఉద్యమ సమయం లో రెండు ప్రాంతాల మద్య వైషమ్యాలు తొలగించడానికి చేసిన కృషిని పవన్ చెప్పక పోవడం ఆశర్యం అనిపించింది. ఎంతో అభిమాన నాయకుడు వెంకయ్య నాయుడు గారు అంటూనే, వెంకయ్య మాటల గారడిని అలవాటులో పొరబాటున తన గురించి ఆయన స్థాయి కి తగని మాటలు మాట్లాడిన వెంకయ్య ను కూడా మొత్తేసాడు !
వీ.హనుమంత రావు అతి స్వామి భక్తీ లో మాట్లాడే తెలివి తక్కువ మాటల పై విరుచుకు పడి వ్యక్తీగతం గా విమర్శిస్తే ఊరుకోను అంటూ కాంగ్రెస్ వారినే కాదు ఏ పార్టీ అయినా నన్ను వ్యక్తిగత జీవితాలను విమర్శిస్తే వోప్పుకోనని మీ వ్యక్తీగత జీవితాలను బయట పెడుతాను అని హెచ్చరించారు.
"జై రామ్ రమేష్  నీ కథలు , వేషాలు చేష్టలు చూస్తె చాలు ఢిల్లీ కాంగ్రెస్ చేసే నిస్సుగ్గు అవకాశ వాద విభజన రాజకీయాలకు నిలువెత్తు చిహ్నం నువ్వు" అంటూ ఎండగట్టాడు
పవన్ పార్టీ పెట్టి కాంగ్రెస్ లో కలుపాలన్న డిగ్గిరాజ ను తిడుతూ మీ కాంగ్రెస్ గంగా నది అనుకొంటున్నారా కలపడానికి నేనెలా కనబడుతున్నాను (నాకైతే నేను మా అన్న చిరంజీవి ని కాదు అని చెప్పినట్లు అనిపించింది ) తెలుగుజాతి ని గర్వ పడేటట్లు చేసిన వ్యక్తులను వీడు ఆంధ్రుడా ,తెలంగాణా వాడా అని ప్రశ్నించే మూర్కపు వాదులను తెలివి తక్కువ వెదవల్ని ఉతికి ఆరేసాడు .indirect గా ట్యాంక్ బండు విగ్రహాల పై జరిగిన విద్వంసపు దాడులను విమర్శించకనే విమర్శించాడు
భారతీయ సనాతన ధర్మం గురించి తనకు అర్దమై న విషయాన్ని(కమ్యునిజం  భావాల నుంచి బయట పడడానికి వారు ఇంకా సనాతన ధర్మం మీద ఇంకా చాలా చదవాలి ) చెప్పి భారతీయ జనతా పార్టీ శ్రేణులను చల్ల బరిచారు .కాంగ్రెస్ పై మాత్రమే నా పోరాటం దానికి ఏ పార్టీతో నైనా కలుస్తా అని చెప్పి మిగతా పార్టీలను చల్ల బరిచాడు .
మాట్లాడితే చిరంజీవి ,నాగబాబు ,కళ్యాణ్ బాబులు మా కులం వారె అని తెగ చించు కొనే కాపు నాయకులకు కూడా మీరెవరు నాకు చెప్పడానికి నేను భారతీయుడ్ని నన్ను కులం సంఘం వాడిని చేయవద్దు అని లెంప కాయలు వేశాడు . వీళ్ళు మారుతారో లేదో గాని వీరి విపరీత తిక్కకు ముందే మందు వేసి లెక్క కుదిర్చాడు !
రాహుల్ గాంధీ చెప్పే కొత్త యువ నాయకులు అంటే కాంగ్రెస్ నేతల కొడుకులు, కూతుర్లు ,చెల్లెలు, సోదరుడు కాదని వారసత్వం రాజకీయాలు పోవాలి అని చెప్పాడు .దమ్ముంటే రాహుల్ సోనియా గాంధీలు మీ బొత్స సత్యనారాయణ విజయ నగరం లో సభ పెట్టండి అంటూ బొత్స కు గతం జరిగిన భంగపాటు ను సుతి మెత్తగా గుర్తు తెచ్చాడు.
ఇప్పుడు మతం కోసం ,ప్రాంతం కోసం ప్రాణ మిస్తారు నేను దేశం కోసం ప్రాణమిస్తాను అని చెప్పటంలో కొంచెం తడబడి భగత్ సింగ్ తరువాత దేశం కోసం మొట్ట మొదట నేనే చంపుకుంటాను అన్నాడు. ఇది ప్రసంగం లో కొంచెం దోషం అనిపించింది ఎందుకంటే దేశ సరి హద్దుల్లో యుద్ధం చేసే వారు దేనికోసం ప్రాణ మిస్తున్నారు దేశం కోసమే కదా !
BJP ని పల్లెత్తు మాట అనకుండా నరేంద్ర మోడీ పై అందరి లాగే తనకున్న గౌరవాన్ని చూపాడు దివంగత రాజశేఖర్ రెడ్డి ని ఏదో సాకుతో విమర్చించలేదు అలాగని చంద్ర బాబు గారిని వూరికే  పొగడ లేదు. మాట్లాడితే పార్టీ లు మారే రాజకీయ ఆయారం గయరామ్ నాయకు లను పార్టీ లో చేర్చుకొను అని చెప్పారు టీ అర్ ఎస్ పై కూడా తీవ్రముగా విమర్సలు చేయకుండా తనపై వారు చేసిన విమర్సల పై మాత్రమె రెస్పాండ్ అయ్యి కొంత సంయమనం పాటించాడు ! చాలా ఉదాహరణలు చెప్పి సీమంద్ర వారిని తిడితే బంగారు తెలంగాణా ఎలా వస్తుందో చెప్పాలని అంటూనే నేను ప్రేమించే తెలంగాణ తో, ఆ ప్రజలతో నాకు ఎంతో సన్నీహితం వుంది అని గడియ గడియకి చెప్పాడు ఒక్క కాంగ్రెస్ ను తప్ప అందరిని మెప్పింప ప్రయత్నించాడు అన్నది నిజం ! కాకపోతే సీరియస్ గా మాట్లాడుతూ సినిమా స్టైల్ లో అప్పుడప్పుడు నవ్వటం కొంచెం అసహజం అనిపించింది . 
మొత్తం మీద రాష్ట్ర విభజన జరిగిన తీరు పై తన అసంతృప్తిని చెపుతూ తెలుగు వాడి పౌరుషం చూపాడు.
ధన్యవాదములతో
గోపి చిల్లకూరు
డల్లాస్ టెక్సాస్
 

Pawan in "Jana Sena" Press Meet

ప్రజలు ఎప్పుడు సేఫ్ గా ఉంటారో, 
ఎవరి పాలన లో బావుంటారో 
అలాంటి వారితో చేతులు కలుపుతాను

Jana Sena Party

PawanKalyan's new political party is named JanaSena!


పవర్ కోసం కాదు .... ప్రశ్నించడానికి ....'జనసేన పార్టీ'

Jana Sena Party Target is Not a particular party But The Entire Governance and Political System.